ఎఐఎడబ్ల్యుయు ప్రధాన కార్యదర్శి బి.వెంకట్
ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : భూ సాధన కోసం దేశవ్యాప్తంగా ప్రత్యక్ష ఉద్యమానికి సిద్ధం కావాలని ఎఐఎడబ్ల్యుయు ప్రధాన కార్యదర్శి బి.వెంకట్ పిలుపు ఇచ్చారు. బుధవారం కర్ణాటకలో జరిగిన భూ సదస్సులో వెంకట్ మాట్లాడుతూ అరకొర సంక్షేమ కార్యక్రమాలతో ప్రజలను మోసం చేయడం పాలక వర్గాల విధానమైందని విమర్శించారు.
భూ పంపిణీ గురించి గతంలో మాటలునైనా చెప్పేవారని, బిజెపి పాలనలో రివర్సు భూ పందేరం జరుగుతుందని దుయ్యబట్టారు. కార్పొరేటర్లకు, కంపెనీలకు అభివృద్ధి పేరుతో లక్ష ఎకరాల భూమిని దోచి పెడుతున్నారని అన్నారు.. ఇప్పటికీ 10 శాతం గ్రామీణ ధనిక వర్గం చేతిలో 30 శాతానికి పైబడి భూమి ఉందని అన్నారు. వారే గ్రామీణ ఆర్ధిక వ్యవస్థను నియంత్రిస్తున్నారని పేర్కొన్నారు. రాజకీయ, సాంఘిక రంగాలలో వారే శాసిస్తున్నారని అన్నారు. పేదలకు పంపిణి చేయాలని, భూపంపిణీ జరగకుండా కొనుగోలుశక్తి ఎలా వస్తుంది? ఉపాధి ఎలా కల్పిస్తారని ప్రశ్నించారు. ఈ సదస్సులో 47 మందితో భూ హక్కల సాధన కమిటీ ఎన్నికైంది. అనిల్ గౌరవ అధ్యక్షుడిగా, ముని వెంకటప్ప కార్యదర్శిగా ఎన్నికయ్యారు.
![](https://prajasakti.com/wp-content/uploads/2025/01/venkat.jpg)