సంస్కృతికి ప్రతీక, ఇప్పుడు భయానికి ప్రతీకగా మారింది

May 16,2024 08:02 #BJP Govt, #Hindutva Agenda, #kerala

త్రిస్సూర్ :  భిక్షువులు, బ్రహ్మచారుల కాషాయం భారతీయ సంస్కృతికి ప్రతీక, కానీ ఇప్పుడు భయానికి ప్రతీకగా మారిందని త్రిసూర్ ఆర్చ్ డియోసెస్ మౌత్ పీస్ ‘క్యాథలిక్ చర్చి’ పేర్కొంది. మే సంచికలో ‘మత చిహ్నాలను టెర్రర్ చిహ్నాలుగా ఉపయోగించకూడదు’ అనే మొదటి పేజీలో ఆందోళన వ్యక్తం చేసింది. కుంకుమను చూస్తే భయం వేస్తోందని హిందూ మతవాదుల దాడికి గురైన వారి రోదనలు విన్నామని పేర్కొంది. కాషాయంను మత-రాజకీయ భావజాల వ్యాప్తి వినియోగిస్తూ భారతదేశ గొప్ప సంస్కృతిని అవమానిస్తున్నారని పేర్కొంది. తెలంగాణలో గత నెలలో జైశ్రీరామ్ పిలుపు మేరకు వచ్చిన సంఘ్ పరివార్ కార్యకర్తలు క్రిస్టియన్ చర్చి ఆధ్వర్యంలోని సెయింట్ మదర్ థెరిసా ఇంగ్లీష్ మీడియం స్కూల్ పై దాడి చేశారని పేర్కొంది.  పాఠశాల మరియు మదర్ థెరిసా రూపాన్ని ధ్వంసం చేశారని తెలిపింది. కాషాయ జెండాను కూడా పాతారని పేర్కొంది. ఇతరులకు విజ్ఞానాన్ని పంచే సంస్థను ధ్వంసం చేసి,  వారిని భయపెట్టేందుకు కాషాయ జెండా పాతడం చాలా విడ్డూరమని వెల్లడించింది.

దూరదర్శన్ న్యూస్ ఛానెల్ లోగో ఇటీవల కాషాయ రంగులోకి మార్చబడింది. డిడి న్యూస్‌ను అంతర్జాతీయ స్థాయిలో నిలబెట్టే లక్ష్యంతో చేసిన మార్పుల్లో భాగంగానే ఈ రంగు మార్పు అని సమాచార మరియు ప్రసార మంత్రిత్వ శాఖ వివరించింది. బీజేపీ ప్రభుత్వాలు రాజ్యాంగ సంస్థలు, సాంస్కృతిక సంస్థలు, విద్యారంగంలో పెత్తనం చేస్తున్నాయని బలమైన ఆరోపణ ఉంది. పాఠ్యపుస్తకాల్లో కూడా దాని ప్రభావం చూడవచ్చు. గత పాలకుల హయాంలో ఏర్పాటైన అనేక అంశాలు చరిత్ర నుంచి కనుమరుగవుతున్నాయి. కొత్త పార్లమెంట్ భవన నిర్మాణం కూడా అందులో భాగమే.

పార్లమెంటు భవనమే కాదు ప్రజాస్వామ్యమే కనుమరుగవుతుందేమోనని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మళ్లీ అధికారంలోకి వస్తే రాజ్యాంగాన్ని మారుస్తామని బీజేపీ నేతలు చెప్పడం ప్రారంభించినట్లు భావిస్తున్నారు. దేశాన్ని హిందూ రాష్ట్రంగా మార్చేందుకు సంఘ్ పరివార్ ప్రయత్నిస్తున్నదన్న బలమైన సంకేతాలు కనిపిస్తున్నాయన్న ముఖ్‌ప్రసంగ్  ఆందోళన వ్యక్తం చేశారు.

➡️