Road accident: ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లో ఘోర ప్ర‌మాదం.. ఆరుగురు మృతి

ల‌క్నో : ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లోని జాన్‌పూర్‌లో శనివారం అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్ర‌మాదం చోటు చేసుకుంది. కారు అదుపుత‌ప్పి ట్ర‌క్కును ఢీకొట్టింది. ఈ ప్ర‌మాదంలో అక్క‌డిక‌క్క‌డే ఆరుగురు మృతి చెందారు. మ‌రో ముగ్గురు తీవ్రంగా గాయ‌ప‌డ్డారు. స‌మాచారం అందుకున్న పోలీసులు ఘ‌ట‌నాస్థ‌లానికి చేరుకుని స‌హాయ‌క చ‌ర్య‌లు చేప‌ట్టారు. క్ష‌త‌గాత్రుల‌ను స‌మీపంలోని ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. పోలీసులు మృత‌దేహాల‌ను స్వాధీనం చేసుకున్నారు.  అతి వేగ‌మే ఈ ప్ర‌మాదానికి కార‌ణ‌మ‌ని పోలీసులు తెలిపారు. ఈ ప్రమాదంపై కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు ద‌ర్యాప్తు చేప‌ట్టారు. మృతుల వివ‌రాలు తెలియాల్సి ఉంది.

➡️