ఛండీగఢ్ : పంజాబ్‌లో దారుణం జరిగింది. శుక్రవారం అర్థరాత్రి గుర్తు తెలియని దుండగులు ఆప్ ఎమ్మెల్యే గుర్‌ప్రీత్ గోగి పై కాల్పులు జరపడంతో ఆయన మృతి చెందారు. వెంటనే ఆయనను ఆసుపత్రికి తరలించగా అప్పటికే ఎమ్మెల్యే మృతి చెందినట్టుగా వైద్యులు నిర్థారించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి విచారణ చేపడుతున్నట్టుగా పోలీసులు తెలిపారు. పంజాబ్‌లోని లూథియానా వెస్ట్ నియోజక వర్గానికి గుర్‌ప్రీత్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు.