పుణె : మహారాష్ట్రలోని పూణేలో ఒక హెలికాప్టర్ కూలిన ఘటనలో ముగ్గురు చనిపోయారు. ముంబయిలోని జుహుకు వెళ్లడానికి పూణేలోని ఆక్స్‌ఫర్డ్ గోల్ఫ్‌కోర్సు హెలిప్యాడ్ నుంచి బుధవారం ఉదయం 6:45 గంటలకు టేకాఫ్ అయిన క్షణాల్లోనే బవ్దాన్‌లోని కొండల ప్రాంతంలో సదరు హెలికాఫ్టర్ కుప్పకూలింది. ఈ ఘటనలో భారత వాయుసేనకు చెందిన రిటైర్డ్ పైలెట్లు పరంజీత్ సింగ్, గిరీష్‌కుమార్ పిల్లై, నావికా దళానికి చెందిన రిటైర్డ్ ఇంజనీర్ ప్రీతమ్ చంద్ భరద్వాజ్ మరణించినట్లు సంబంధిత అధికారులు తెలిపారు. విపరీతమైన పొగ మంచు కారణంగానే ప్రమాదం జరిగి ఉంటుందని అనుమానిస్తున్నారు. ప్రమాదంలో హెలికాఫ్టర్ పూర్తిగా దగ్ధమైంది. కాగా షెడ్యూలు ప్రకారం ఇదే హెలికాప్టర్ ముంబయికి వెళ్లి నేషనలిస్టు కాంగ్రెస్ పార్టీ (ఎన్‌సిపి) అధ్యక్షులు సునీల్ థాకరేని పికప్ చేసుకొని రాయిగడ్‌లోని సుతార్‌వాడీలోని ఆయన నివాసానికి తీసుకెళ్లాల్సివుండేది.