న్యూయార్క్: ప్రపంచంలోని అత్యంత సంపన్నులలో ఒకరైన భారతీయ వ్యాపారవేత్త గౌతమ్ అదాని లంచం, మోసానికి పాల్పడినట్లు అతనిపై న్యూయార్క్‌లో కేసు నమోదైంది. గౌతమ్ అదాని, ఆయన మేనల్లుడు సాగర అదానితో సహా ఏడుగురిపై అమెరికాలో కేసు నమోదు చేశారు. అమెరికాలో నిధుల సమీకరణ కోసం 25 కోట్ల డాలర్లు (దాదాపు రూ. 2,100 కోట్లు) లంచంగా ఇవ్వజూపారని, ఆ విషయం బయటకు రాకుండా తొక్కిపెట్టారని ఆయనపై ఆరోపణలు చేశారు. వచ్చే 20 ఏళ్లలో అదానీ రెన్యువబుల్ ఎనర్జీ కంపెనీ 200 కోట్ల డాలర్ల (దాదాపు 16,880 కోట్ల రూపాయలు) కంటే ఎక్కువ లాభాలు ఆర్జించే విధంగా పలు కాంట్రాక్టులను దక్కించుకోవడం కోసం, భారత అధికారులకు లంచం చెల్లించేందుకు అదానీతో పాటు ఆయన కంపెనీకి చెందిన సీనియర్ ఎగ్జిక్యూటివ్‌లు అంగీకరించారని యూఎస్ ప్రాసిక్యూటర్లు ఆరోపించారు. ఈ ఆరోపణలపై ఇంకా అదాని స్పందించలేదు.
