ముంబయి : అమెరికా అవినీతి ఆరోపణలతో దాదాపు 55 బిలియన్ డాలర్ల నష్టాన్ని ఎదుర్కొన్నట్లు అదానీ గ్రూప్ బుధవారం ప్రకటించింది. ఆరోపణలను ఖండిస్తున్నట్లు తెలిపింది. అమెరికా డిపార్ట్‌మెంట్ ఆఫ్ జస్టీస్ (యుఎస్ డిఒజె) నేరారోపణలను ప్రకటించినప్పటి నుండి తమ 11 లిస్టెడ్ కంపెనీలలో దాని మార్కెట్ క్యాపిటలైజేషన్‌లో సుమారు 55 బిలియన్ డాలర్ల నస్టాన్ని చవిచూసినట్లు ఓ ప్రకటనలో తెలిపింది. నవంబర్ 20న అదానీపై ప్రకటించిన ఆరోపణలతో అంతర్జాతీయ పెట్టుబడిదారులను ఉద్దేశపూర్వకంగా తప్పుదోవ పట్టిస్తున్నారని పేర్కొంది. ఈ ఆరోపణలు నిరాధారమనవిగా పేర్కొంటూ తిరస్కరించింది. అంతర్జాతీయ ప్రాజెక్టు రద్దు, ఆర్థికమార్కెట్‌పై ప్రభావం, వ్యూహాత్మక భాగస్వామ్యులు, పెట్టుబడిదారులు మరియు ప్రజల నుండి ఆకస్మిక పరిశీలన వంటి తీవ్రమైన పరిణామాలు ఎదురైనట్లు అదానీ గ్రూప్ పేర్కొంది.