వ్యవసాయ కార్మికోద్యమ నేత అంబికా ప్రసాద్‌ మిశ్రా కన్నుమూత

Mar 16,2025 00:11 #cpm leader

లక్నో : సిపిఎం సీనియర్‌ నాయకులు, ఉత్తరప్రదేశ్‌లో వ్యవసాయ కార్మికోద్యమ నేత అంబికా ప్రసాద్‌ మిశ్రా శనివారం కన్నుమూశారు. ఆయన వయస్సు 93 సంవత్సరాలు. అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం (ఎఐఎడబ్ల్యుయు) యుపి విభాగానికి అనేక సంవత్సరాలు నేతృత్వం వహించిన ఆయన పార్టీలోనూ పలు నాయకత్వ స్థానాల్లో పని చేసి ఉద్యమ నిర్మాణంలో కీలక పాత్ర పోషించారు. అంబికా ప్రసాద్‌ మృతి పట్ల సిపిఎం కేంద్ర కమిటీ తీవ్ర సంతాపం ప్రకటించింది. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేసింది.

➡️