యోగి సర్కార్ పై అఖిలేష్ యాదవ్ ఆగ్రహం

ఇంటర్నెట్ : ఉత్తరప్రదేశ్ లోని యోగి ఆధిత్యనాథ్ ప్రభుత్వంపై సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ విమర్శలు గుప్పించారు. ఎటావాలోని చంబల్ లోయలలో పెద్ద ఎత్తున అక్రమ మైనింగ్, పర్యావరణ విధ్వంసం జరిగిందని ఆరోపించారు. యుపి ప్రభుత్వం నేతృత్వంలోని అధికారులు అక్కడున్న  పెద్ద పెద్ద కొండలు అదృశ్యం కానున్నాయని ఆరోపించారు. ఈ మేరకు ఆయన ఎక్స్ వేదికగా పోస్టు చేశారు. యోగి అధిత్యనాథ్ ప్రభుత్వం దిగువ, ఉన్నత స్థాయి అధికారులతో కలిసి చారిత్రాత్మక సుమేర్ సింగ్ కోట సమీపంలోని చిన్న, పెద్ద కొండలను బస్తీ, గోరఖ్‌పూర్ వంటి ప్రాంతాలుగా మార్చేస్తారా అని యాదవ్ ప్రశ్నించారు. ఒకప్పుడు కొండలు ఉన్న చోట పాక్షికంగా చదును చేయబడిన ప్రకృతి దృశ్యాన్ని చూపించే వీడియో క్లిప్‌ను ఆయన ఎక్స్ లో పోస్టు చేశారు. కొత్త అధికారులు వస్తారు, వెళ్తారని, కానీ అవినీతి గొడ్డలితో నరికివేసి, కుట్ర ద్వారా ధ్వంసం చేసిన చంబల్ కొండలు తిరిగి ఎలా తెస్తారని ఘాటు విమర్శలు చేశారు. పర్యావరణ్ కహే ఆజ్ కా, నహి చాహియే బిజెపి (నేటి వాతావరణం పేరుతో, మనకు బిజెపి అవసరం లేదు) అని అఖిలేష్ యాదవ్ ఎక్స్ లో పేర్కొన్నారు.

➡️