- 30 మందికి కేబినెట్, ఐదుగురికి స్వతంత్ర హోదా
- మరో 36 మందికి సహాయ మంత్రి పదవులు
- రామ్మోహన్నాయుడుకు విమానయానశాఖ
ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : కేంద్రంలో కొలువుదీరిన ఎన్‌డిఎ సంకీర్ణ సర్కారు మంత్రులకు శాఖలు కేటాయించింది. ఆదివారం ప్రధాన మంత్రి నరేంద్ర మోడీతోపాటు 71 మంది కేంద్ర మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. వీరిలో 30 మందికి కేబినెట్ హోదా, ఐదుగురికి స్వతంత్ర హోదా, 36 మంది సహాయ మంత్రులుగా ఉన్నారు. వీరికి తాజాగా శాఖలు కేటాయించారు. కీలకమైన శాఖలను బిజెపి తన వద్దే ఉంచుకుంది. మళ్లీ కేంద్ర హోంమంత్రి బాధ్యతలు అమిత్ షా చేపట్టగా, రక్షణశాఖను రాజ్‌నాథ్ సింగ్‌కు కేటాయించారు. రోడ్డు, రవాణాశాఖను నితిన్ గడ్కరీకి కేటాయించారు. ఆర్థికశాఖను నిర్మలా సీతారామన్‌కు కేటాయించారు. విదేశీ వ్యవహారాల శాఖను జై శంకర్, రైల్వే, సమాచార, ప్రసార మంత్రి, ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ శాఖను అశ్విని వైష్ణవ్‌కు కట్టబెట్టారు.
ఆంధ్రప్రదేశ్ నుంచి తొలిసారి కేంద్ర మంత్రివర్గంలో అడుగుపెట్టిన టిడిపి నేత కింజరాపు రామ్మోహన్నాయుడుకు పౌర విమానాయానశాఖ కేటాయించారు. అలాగే మరో టిడిపి నేత, కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్‌కు గ్రామీణాభివృద్ధి, కమ్యూనికేషన్ శాఖను కేటాయించారు. నర్సాపురం బిజెపి ఎంపి, కేంద్ర సహాయ మంత్రి శ్రీనివాస వర్మకు ఉక్కు, భారీ పరిశ్రమలశాఖను కేటాయించారు. తెలంగాణ నుంచి కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డికి బొగ్గు గనులశాఖ కేటాయించగా, కేంద్ర సహాయ మంత్రి బండి సంజరుకు హోంశాఖను కేటాయించారు.
కేబినెట్ మంత్రులు .. వారి శాఖలు
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ-పర్సనల్, పబ్లిక్ గ్రీవెన్స్, పెన్షన్స్, ఆటోమిక్ ఎనర్జీ, స్పేస్
1. రాజ్‌నాథ్ సింగ్ – రక్షణ
2. అమిత్ షా – హోం
3 నితిన్ గడ్కరీ – రోడ్డు రవాణా, రహదారులు
4. జెపి నడ్డా – ఆరోగ్య, కుటుంబ సంక్షేమ, రసాయనాలు, ఎరువులు
5. శివరాజ్ సింగ్ చౌహాన్ – వ్యవసాయం, రైతుల సంక్షేమ, గ్రామీణాభివృద్ధి
6. నిర్మలా సీతారామన్ -ఆర్థిక, కార్పొరేట్ వ్యవహారాలు
7. ఎస్. జైశంకర్ – విదేశీ వ్యవహారాలు
8. మనోహర్ లాల్ ఖట్టర్-హౌసింగ్, పట్టణ వ్యవహారాలు, విద్యుత్
9. హెచ్డి కుమారస్వామి – భారీ పరిశ్రమలు, ఉక్కు
10. పీయూష్ గోయల్ – వాణిజ్యం, పరిశ్రమలు
11. ధర్మేంద్ర ప్రధాన్ – విద్య
12. జితన్ రామ్ మాంఝీ – సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు
13. రాజీవ్ రంజన్ సింగ్ – పంచాయతీరాజ్‌శాఖ, మత్స్య, పశుసంవర్థక, పాడి పరిశ్రమలు
14. సర్బానంద సోనోవాల్ – ఓడరేవులు, షిప్పింగ్, జలమార్గాలు
15. వీరేంద్ర కుమార్ – సామాజిక న్యాయం, సాధికారత
16. కింజరాపు రామ్మోహన్నాయుడు – పౌర విమానయాన
17. ప్రహ్లాద్ జోషి – వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం, ప్రజా పంపిణీశాఖ, కొత్త పునరుత్పాదక ఇంధన
18. జువల్ ఓరం -గిరిజన వ్యవహారాలు
19. గిరిరాజ్ సింగ్ – జౌళి
20. అశ్విని వైష్ణవ్ – రైల్వేశాఖ, సమాచార, ప్రసార మంత్రి, ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ
21. జ్యోతిరాదిత్య సింధియా -కమ్యూనికేషన్స్, ఈశాన్య ప్రాంత అభివృద్ధి
22. భూపేందర్ యాదవ్ – పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పులు
23. గజేంద్ర సింగ్ షెకావత్ -సాంస్కృతిక శాఖ, పర్యాటక
24. అన్నపూర్ణా దేవి -మహిళా శిశు అభివృద్ధి
25. కిరణ్ రిజిజు- పార్లమెంటరీ వ్యవహారాలశాఖ, మైనారిటీ వ్యవహారాలు
26. హర్దీప్ సింగ్ పూరి- పెట్రోలియం, సహజ వాయువు శాఖ
27. మన్సుఖ్ మాండవియా -కార్మిక, ఉపాధి మంత్రిత్వ, యువజన వ్యవహారాలు, క్రీడలు
28. కిషన్ రెడ్డి – బొగ్గు, గనులశాఖ
29. చిరాగ్ పాశ్వాన్ – ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమలు
30. సిఆర్ పాటిల్ – జలశక్తి
స్వతంత్ర హోదా మంత్రులు
31. రావు ఇంద్రజిత్ సింగ్- స్టాటస్టిక్స్, ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్, ప్రణాళికా, సాంస్కృతిక
32. జితేంద్ర సింగ్- సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎర్త్ సైన్స్, పర్సనల్, పబ్లిక్ గ్రీవెన్స్, పెన్షన్స్
33. అర్జున్ రామ్ మేఘ్వాల్- న్యాయ, పార్లమెంటరీ వ్యవహారాలు
34. జాదవ్ ప్రతాప్రావు- ఆయూష్, హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్
35. జయంత్ చౌదరి-స్కిల్ డవలప్మెంట్
సహాయ మంత్రులు
36. జితిన్ ప్రసాద – వాణిజ్య, పరిశ్రమలు, ఐటీ, ఎలక్ట్రానిక్స్
37. శ్రీపాద్ యశోనాయక్ – విద్యుత్తు, పునరుత్పాక ఇంధనం
38. పంకజ్ చౌదరి – ఆర్థికం
39. క్రిషన్ పాల్ – సహకారం
40. రామ్ దాస్ అథవలె – సామాజిక న్యాయం, సాధికారత
41. రామ్‌నాథ్ ఠాకూర్ – వ్యవసాయ, రైతు సంక్షేమం
42. నిత్యానందరారు – హోం
43. అనుప్రియ పటేల్ – ఆరోగ్య, కుటుంబ సంక్షేమం, ఎరువులు – రసాయనాలు
44. వి.సోమన్న – జల్ శక్తి, రైల్వే
45. పెమ్మసాని చంద్రశేఖర్ – గ్రామీణాభివద్ధి, కమ్యూనికేషన్స్
46. ఎస్.పి.సింగ్ బఘేల్ – మత్స్య, పశుసంవర్ధక, డెయిరీ, పంచాయతీ రాజ్
47. శోభా కరంద్లాజే – సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు, కార్మిక, ఉపాధి
48. కీర్తివర్ధన్ సింగ్ – పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పులు, విదేశాంగ
49. బిఎల్ వర్మ – వినియోగదారుల వ్యవహారాలు, ఆహార – ప్రజా పంపిణీ, సామాజిక న్యాయం – సాధికారత
50. శాంతను ఠాకూర్ – పోర్టులు, షిప్పింగ్, వాటర్‌వేస్
51. సురేష్ గోపి – పెట్రోలియం, సహజవాయువులు, పర్యటకం
52. ఎల్.మురుగన్ – సమాచార – ప్రసారాలు, పార్లమెంటరీ వ్యవహారాలు
53. అజయ్ టమ్టా – రోడ్డు రవాణా, హైవేలు
54. బండి సంజరు కుమార్ – హోం
55. కమలేష్ పాశ్వాన్ – గ్రామీణాభివద్ధి
56. భగీరథ్ చౌదరి – వ్యవసాయ, రైతు సంక్షేమం
57. సతీశ్ చంద్రదూబే – బొగ్గు, గనులు
58. సంజయ్ సేఠ్ – రక్షణ
59. రవ్నీత్ సింగ్ బిట్టూ – ఆహార శుద్ధి పరిశ్రమ, రైల్వేలు
60. దుర్గాదాస్ ఉయికె – గిరిజన వ్యవహారాలు
61. రక్షా నిఖిల్ ఖడ్సే – యువజన వ్యవహారాలు – క్రీడలు
62. సుఖాంత మజుందార్ – విద్య, ఈశాన్య ప్రాంత అభివృద్ధి
63. సావిత్రి ఠాకుర్ – మహిళా, శిశు సంక్షేమాభివృద్ధి
64. టోకన్ సాహు – గహ నిర్మాణ, పట్టణ వ్యవహారాలు
65. రాజ్ భూషణ్ చౌదరి – జల్ శక్తి
66. భూపతిరాజు శ్రీనివాస వర్మ – భారీ పరిశ్రమలు, ఉక్కు
67. హర్ష్ మల్హోత్రా – కార్పొరేట్ వ్యవహారాలు, రోడ్డు రవాణా – హైవేలు
68. నిముబెన్ జయంతిభారు బాంభణియా – వినియోగదారుల వ్యవహారాలు, ఆహార – ప్రజా పంపిణీ
69. మురళీధర్ మొహోల్ – సహకార, పౌర విమానయానం
70. జార్జ్ కురియన్ – మైనారిటీ వ్యవహారాలు, మత్స్య – పశుసంవర్ధక – డెయిరీ
71. పబిత్ర మార్గరీటా – విదేశీ వ్యవహారాలు, టెక్స్టైల్స్