ప్రణబ్‌ ముఖర్జీ సార్మక చిహ్నానికి స్థలం కేటాయింపు

న్యూఢిల్లీ : మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ స్మారక చిహ్నాం నిర్మాణం కోసం కేంద్ర ప్రభుత్వం స్థలం కేటాయించింది. ఈ విషయాన్ని ప్రణబ్‌ ముఖర్జీ కుమార్తె శర్మిష్ట ముఖర్జీ సోషల్‌ మీడియా ద్వారా వెల్లడించారు. రాజ్‌ఘాట్‌ ఆవరణలో భాగమైన ‘రాష్ట్రీయ స్మృతి’ కాంప్లెక్స్‌లో ప్రణబ్‌ ముఖర్జీ సార్మక చిహ్నాం నిర్మాణానికి స్థలాన్ని కేటాయించినట్లు కేంద్ర గృహ నిర్మాణ, పట్టణ మంత్రిత్వ శాఖ తనకు లేఖ ద్వారా తెలిపినట్లు శర్మిష్ట తెలిపారు. ఈ విషయంపై మంగళవారం ప్రధానమంత్రి నరేంద్ర మోడీని కలిసి శర్మిష్ట కృతజ్ఞతలు తెలిపారు. కాగా, ఇటీవల మరణించిన మాజీ ప్రధానమంత్రి మన్మోహన్‌ సింగ్‌కు ఢిల్లీలో సార్మక చిహ్నాం నిర్మించాలని కాంగ్రెస్‌ డిమాండ్‌ చేస్తున్న సందర్భంలో కేంద్రం నుంచి ప్రణబ్‌ స్మారక చిహ్నం కోసం ప్రకటన రావడం గమనార్హం.

➡️