వాషింగ్టన్ : భారత, అమెరికాలు కొత్త ద్వైపాక్షిక ఫోరమ్ ఏర్పాటుకు ప్రణాళిక సిద్ధం చేస్తున్నాయి. భారత ప్రధాని నరేంద్ర మోడీ అమెరికా పర్యటనలో భాగంగా ఈవిధమైన చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాల మెరుగుదలకై భారతదేశం – మిడిల్ ఈస్ట్- యూరప్ కారిడార్, I2U2 గ్రూపుల నుంచి అమెరికా అధ్యక్షుడు ట్రంప్, ప్రధాని మోడీ సమావేశపరిచి కొత్త కార్యక్రమాల రూపకల్పన చేయనున్నారని శుక్రవారం మోడీ, ట్రంప్ భేటీ అనంతరం సంయుక్త ప్రకటనను విడుదల చేశారు. వెస్ట్రన్ ఇండియన్ ఆసియన్, మిడిల్ ఈస్ట్, ఇండో పసిఫిక్‌లలో ఈ ఫోరమ్ ద్వారా కొత్త భాగస్వామ్య కార్యక్రమాలను కూడా ప్రకటించాలని భావిస్తున్నట్లు ఈ ప్రకటన పేర్కొంది.
