పూనె : ఛత్రపతి శివాజీ మహారాజ్ 345వ వర్థంతి సందర్భంగా నేడు కేంద్ర హోంమంత్రి అమిత్‌షా రారుగఢ్ కోటకు చేరుకోనున్నారు. నేడు రారుగఢ్ కోటలోని ఛత్రపతి శివాజీ మహారాజ్ స్మారక చిహ్నం వద్ద అమిత్ షా నివాళులర్పించనున్నారు. (ఛత్రపతి శివాజీ 1630, ఏప్రిల్ 3న మృతి చెందారు.)
కాగా, ఔరంగజేబు సమాధి వంటి వివాదాల నేపథ్యంలో నేడు అమిత్‌షా పర్యటన ఉన్నట్లు తెలుస్తోంది. ఈ పర్యటన సందర్భంగా రారుగఢ్, నాసిక్‌లలో సంరక్షక మంత్రుల నియామకంపై చర్చించడానికి అమిత్ షా మహాయతి కూటమిలోని పలువురు ప్రముఖ నాయకులను కలవనున్నారు.
