కోల్‌కతాలో మరో మూక హత్య

Jun 29,2024 22:45 #gang murder, #Kolkata
upadhi worker died

కోల్‌కతా : పశ్చిమ బెంగాల్‌ రాజధాని కోల్‌కతాలో మరో మూక హత్య జరిగింది. శనివారం మొబైల్‌ ఫోన్‌ దొంగతనం చేసాడనే అనుమానంతో నగర శివారు ప్రాంతం సాల్ట్‌ లేక్‌లో ఓ యువకుడిని దారుణంగా కొట్టి చంపారు. మృతుడిని 22 ఏళ్ల ప్రసేన్‌ మండల్‌గా గుర్తించారు. శుక్రవారం కూడా నడిబడ్డున మూక హత్య జరిగింది. మొబైల్‌ ఫోన్‌ దొంగతనం చేసాడనే అనుమానంతోనే చాందనీ చౌక్‌ ప్రాంతంలో ఇర్షాద్‌ను కొట్టి చంపారు. ఈ కేసులో 14 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రసేన్‌ హత్య కేసులో ముగుర్ని పోలీసులు అరెస్టు చేశారు.

➡️