న్యూఢిల్లీ : కేంద్ర ప్రభుత్వం అధికార యంత్రాంగంలో భారీగా మార్పులు చేసింది. వివిధ శాఖల్లో 29 మంది సంయుక్త కార్యదర్శులను నియమించింది. ఇండియన్ డిఫెన్స్ అకౌంట్స్ సర్వీస్ (ఐడీఏఎస్), ఇండియన్ రైల్వే సర్వీస్ ఆఫ్ ఎలక్ట్రికల్ ఇంజినీర్స్ (ఐఆర్‌ఎస్‌ఇఇ), ఇండియన్ ఆడిట్ అండ్ అకౌంట్స్ సర్వీస్ (ఐఎ అండ్ ఎఎస్), ఇండియన్ రెవెన్యూ సర్వీస్ (ఐఆర్‌ఎస్) సహా పలు కేంద్ర సర్వీసుల్లో పనిచేస్తును అధికారులను కీలకమైన సంయుక్త కార్యదర్శి స్థాయి పోస్టుల్లో నియమించింది. ఈ మేరకుసిబ్బంది మంత్రిత్వ శాఖ ఆదేశాలు జారీ చేసింది. ఐడిఎఎస్ అధికారులు ప్రవీణ్ కుమార్ రారు, రాకేష్ కుమార్ పాండే, ఐఆర్‌ఎస్‌ఇఇ అధికారి రాజేష్ గుప్తాలను హోం శాఖలో సంయుక్త కార్యదర్శులుగా నియమించారు. 1999 బ్యాచ్ ఐఎ అండ్ ఎఎస్ అధికారి రాజ్‌కుమార్ సిఆర్‌పిఎఫ్‌లో డైరెక్టర్ (ఫైనాన్స్) అయ్యారు. ఆంధ్రప్రదేశ్ కేడర్‌కు చెందిన 1996 బ్యాచ్ ఐపీఎస్ అధికారి భావనా సక్సేనాను సెంట్రల్ అడాప్షన్ రిసోర్స్ అథారిటీ సీఈఓగా నియమించారు.