న్యూఢిల్లీ : నేడు లోక్‌సభలో ప్రవేశపెట్టిన ఆయిల్ ఫీల్స్డ్ (రెగ్యులేషన్ అండ్ డెవలప్‌మెంట్) సవరణ బిల్లు 2024 ఆమోదం పొందింది. ఈ బిల్లును పెట్రోలియం, సహజవాయువు శాఖా మంత్రి హర్‌దీప్ సింగ్ పూరి ప్రవేశపెట్టారు. ఈ బిల్లు మూజువాణి ఓటింగ్ ద్వారా ఆమోదం లభించింది. ఇదిలా ఉండగా రైల్వేశాఖ పనితీరుపై బుధవారం రాజ్యసభలో చర్చ జరిగింది. హోలీ కారణంగా రాజ్యసభ సోమవారానికి వాయిదా పడింది. చర్చల్లో వచ్చిన ప్రశ్నలపై రైల్వేశాఖా మంత్రి సోమవారం బదులివ్వనున్నారు.