న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీలో గాలి నాణ్యతలు పడిపోయాయి. ఈరోజు ఉదయం 8.30 గంటల సమయానికి ఎక్యూఐ 247 స్థాయిలో నమోదైందని, పూర్ కేటగిరీగా వర్గీకరించినట్లు కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి పేర్కొంది. ఢిల్లీలోనే కాదు.. పంజాబ్, హర్యానా రాష్ట్రాల్ని కూడా మంచు కప్పేసినట్లు భారత వాతావరణశాఖ (ఐఎండి) తెలిపింది. అలాగే చండీగఢ్, పశ్చిమ ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో కూడా విపరీతంగా మంచు కురిసిందని వాతావరణశాఖ పేర్కొంది. మరోవైపు దక్షిణాది రాష్ట్రమైన తమిళనాడులో కూడా మంచు బాగా కురవడంతో చెన్నై అంతర్జాతీయ విమానాశ్రయంలోని పలు విమానాల రాకపోకలు ఆలస్యంగా నడుస్తున్నాయి.
