బీహార్‌ గవర్నర్‌గా ఆరిఫ్‌ ముహమ్మద్‌ ఖాన్‌ ప్రమాణస్వీకారం

పాట్నా :   బీహార్‌ గవర్నర్‌గా ఆరిఫ్‌ ముహమ్మద్‌ ఖాన్‌ గురువారం ప్రమాణ స్వీకారం చేశారు. పాట్నా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ కె.వినోద్‌ చంద్రన్‌ ఖాన్‌తో ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమానికి సిఎం నితీష్‌ కుమార్‌, ఉప ముఖ్యమంత్రి సామ్రాట్‌ చౌదరి, ఇతర రాష్ట్ర మంత్రులు, ఉన్నతాధికారులు హాజరయ్యారు.

➡️