న్యూఢిల్లీ : మోడీ ప్రభుత్వంపై ఆప్ జాతీయ కన్వీనర్ కేజ్రీవాల్ ఆదివారం విరుచుకుపడ్డారు. కేంద్రంలోని అధికార పార్టీ విద్యను నాశనం చేస్తోందని మండిపడ్డారు. గుజరాత్ మోడల్‌లా బిజెపి దేశం మొత్తాన్ని నిరక్షరాస్యులుగా ఉంచాలని కోరుకుంటోందని అన్నారు.
” ఇది గుజరాత్ మోడల్. ఇది బిజెపి మోడల్, మోడీ ప్రభుత్వం దేశవ్యాప్తంగా అమలు చేయాలనుకుంటోంది. ఇది డబుల్ ఇంజిన్ మోడల్. దేశం మొత్తాన్ని నిరక్షరాస్యులుగా మార్చాలనుకుంటోంది. బిజెపి అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో, విద్యను నాశనం చేయని ఒక్క రాష్ట్రం పేరైనా చెప్పండి” అని ఎక్స్‌లో పేర్కొన్నారు. ఢిల్లీని కూడా బిజెపి ప్రభుత్వం నాశనం చేస్తోందని అన్నారు.
157 పాఠశాలల్లో 10వ తరగతి బోర్డు పరీక్షల్లో ఒక్క విద్యార్థి కూడా ఉత్తీర్ణత సాధించలేకపోయారని సమాజ్‌వాది పార్టీ (ఎస్‌పి) అఖిలేష్ యాదవ్ దుయ్యబట్టారు.
