Arvind Kejriwal: కేజ్రీవాల్‌కు ఇడి కేసులో బెయిల్‌

సిబిఐ కేసులో జైల్లోనే..
ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : ఢిల్లీ మద్యం పాలసీ కేసులో ఆమ్‌ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్‌, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌కు ఊరట లభించింది. ఆయనకు సుప్రీంకోర్టు మధ్యంతర బెయిల్‌ను మంజూరు చేసింది. లిక్కర్‌ కేసులో తనను ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఇడి) అరెస్టు చేయడాన్ని సవాల్‌ చేస్తూ కేజ్రీవాల్‌ సుప్రీంకోర్టులో పిటిషన్‌ వేసిన విషయం తెలిసిందే. ఈ పిటిషన్‌పై శుక్రవారం విచారణ జరిపిన జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నా, జస్టిస్‌ దీపాంకర్‌ దత్తాతో కూడిన ధర్మాసనం, కేజ్రీవాల్‌కు మధ్యంతర బెయిల్‌ మంజూరు చేసింది. ఈ సందర్భంగా సుప్రీంకోర్టు ధర్మాసనం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ కేసు పూర్తిస్థాయి విచారణ కోసం ఐదుగురు సభ్యుల విస్తృత ధర్మాసనానికి నివేదించింది. మొత్తం ఐదు షరతులతో సుప్రీంకోర్టు బెయిల్‌ ఇచ్చింది. సిఎం కార్యాలయాన్ని సందర్శించడానికి వీల్లేదని, గవర్నర్‌ అనుమతి లేకుండా అధికారిక ఫైళ్లపై సంతకం చేయడానికి వీల్లేదని స్పష్టం చేసింది. బెయిల్‌ కోసం రూ.50,000 వ్యక్తిగత పూచీకత్తు చెల్లించాలని పేర్కొంది. ఢిల్లీ మద్యం కేసుకు సంబంధించి ఎలాంటి వ్యాఖ్యలు చేయకూడదని, సాక్షులు ఎవరితోనూ మాట్లాడకూడదు లేదా కేసుతో సంబంధించిన ఫైల్స్‌ జోలికి వెళ్లొద్దని స్పష్టం చేసింది. ఈ మధ్యంతర బెయిల్‌ను పొడిగించవచ్చు లేదా ఎక్కువ మంది సభ్యులతో కూడిన బెంచ్‌ రీకాల్‌ చేయవచ్చునని సుప్రీంకోర్టు పేర్కొంది.
ఈ కేసులో ఢిల్లీ సిఎం కేజ్రీవాల్‌కు రౌస్‌ అవెన్యూ కోర్టు జూన్‌ 20న బెయిల్‌ మంజూరు చేసిన విషయం తెలిసిందే. ఢిల్లీ హైకోర్టులో అప్పీల్‌కు వెళ్లేందుకు బెయిల్‌ ఉత్తర్వులపై 48 గంటలపాటు నిలుపుదల చేయాలన్న ఇడి అభ్యర్థనను ప్రత్యేక జడ్జి నియరు బిందు తిరస్కరించారు. రూ.లక్ష వ్యక్తిగత బాండ్‌ పూచీకత్తుపై కేజ్రీవాల్‌ను విడుదల చేయాలని ఆదేశించారు. ట్రయల్‌ కోర్టు తీర్పుపై  స్టే ఇవ్వాలని కోరుతూ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ జూన్‌ 21న ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది. విచారణ చేపట్టిన ఢిల్లీ హైకోర్టు, ట్రయల్‌ కోర్టు ఇచ్చిన బెయిల్‌ ఉత్తర్వులపై స్టే విధించింది. దీనిని సవాల్‌ చేస్తూ కేజ్రీవాల్‌ సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. దీనిపై శుక్రవారం విచారణ చేపట్టిన సుప్రీం ధర్మాసనం తాజాగా మధ్యంతర బెయిల్‌ మంజూరు చేస్తూ తీర్పు ఇచ్చింది.

సిబిఐ కేసులో కస్టడీ మరో 14 రోజులు పొడిగింపు
సుప్రీం కోర్టు బెయిల్‌ మంజూరు చేసినప్పటికీ కేజ్రీవాల్‌ జైల్లోనే ఉండాల్సి ఉంటుంది. ఇదే కేసులో కేజ్రీవాల్‌ ప్రస్తుతం సిబిఐ కస్టడీలో ఉన్న విషయం తెలిసిందే. ఆయన జ్యుడీషియల్‌ కస్టడీని మరో 14 రోజులు రౌస్‌ అవెన్యూ కోర్టు పొడిగించింది. ఇడి కేసులో తీహార్‌ జైలులో ఉన్న కేజ్రీవాల్‌ను జూన్‌ 21న సిబిఐ అరెస్టు చేసింది. ఆ తరువాత నుంచి జ్యుడీషియల్‌ కస్టడీని సిబిఐ కోరిక మేరకు కోర్టు పొడిగిస్తూ వస్తోంది. జ్యుడీషియల్‌ కస్టడీ గడువు శుక్రవారం నాటికి ముగియడంతో సిబిఐ అధికారులు ఆయనను ఢిల్లీ రౌస్‌ అవెన్యూ కోర్టులో హాజరుపర్చారు. కేజ్రీవాల్‌ను మరింత విచారించాల్సిన అవసరం ఉన్నందున కస్టడీని పొడిగించాలని సిబిఐ కోరడంతో, జ్యుడీషియల్‌ కస్టడీని మరో 14 రోజులు పొడిగిస్తున్నట్లు కోర్టు

➡️