Arvind Kejriwal : నియంతృత్వానికి వ్యతిరేకంగా ఓటు : కేజ్రీవాల్‌

May 25,2024 23:49 #Arvind Kejriwal, #New Delhi, #Voting

న్యూఢిల్లీ : ఆరో దశ పోలింగ్‌లో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ చాందినీ చౌక్‌ లోక్‌సభ నియోజకవర్గంలో సివిల్‌ లైన్స్‌ ప్రాంతంలోని పోలింగ్‌ కేంద్రంలో తన ఓటుహక్కును వినియోగించుకున్నారు.
అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘నా తండ్రి, భార్య, ఇద్దరు పిల్లలతో కలిసి వచ్చి ఓటు వేశాను. అనారోగ్యం కారణంగా మా అమ్మ పోలింగ్‌ కేంద్రానికి రాలేకపోయారు. నేను నియంతృత్వానికి, ద్రవ్యోల్బణం, నిరుద్యోగానికి వ్యతిరేకంగా ఓటు వేశాను. ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకుని ప్రజాస్వామ్యాన్ని కాపాడండి’ అని ఆయన ఓటర్లకు పిలుపునిచ్చారు. ఈ మేరకు ఆయన సామాజిక మాధ్యమం ఎక్స్‌లో కూడా ట్వీట్‌ చేశారు.

➡️