- విదేశాంగ మంత్రి జై శంకర్ వ్యాఖ్యలు
న్యూఢిల్లీ : పాకిస్తాన్‌తో చర్చలు జరిపే శకం ఇక ముగిసి పోయిందని విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్ వ్యాఖ్యానించారు. రాయబారి రాజీవ్ సిక్రి రాసిన కొత్త పుస్తకం ఆవిష్కరణ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా పాక్‌తో భారత్ సంబంధాలపై ఆయన వివరంగా మాట్లాడారు. ”పాక్‌తో నిరంతరంగా చర్చలు జరిపే శకం ముగిసినట్లేనని నేను భావిస్తున్నా. చర్యల వల్ల పర్యవసానాలు వుంటాయి. జమ్మూ కాశ్మీర్‌కు సంబంధించినంతవరకు, చేయాల్సింది 370వ అధికరణ చేసిందనుకుంటున్నాను. ఇక పాకిస్తాన్‌తో ఎటువంటి సంబంధాలు పెట్టుకోవాలని మనం ఆలోచిస్తాం. ప్రస్తుతమున్న సంబంధాలతో భారత్ సంతృప్తిగా వుండి వుంటుందని రాజీవ్ సిక్రి తన పుస్తకంలో పేర్కొన్నారు. అది నిజమో కాదో…మేం నిష్క్రియాపరులం కాదు, సానుకూల దిశలో లేదా ప్రతికూల దిశలో ఏ సంఘటనలు చోటు చేసుకున్నా కచ్చితంగా మేం స్పందిస్తాం.” అని జై శంకర్ పేర్కొన్నారు.