Atishi: దీపావళి నాటికి గుంతలు లేని రోడ్లు : ఢిల్లీ సిఎం

Sep 30,2024 11:24 #Build Roads, #Delhi, #Delhi CM Atishi

ఢిల్లీ: ముఖ్యమంత్రి అతిషి నేతృత్వంలోని ఢిల్లీ క్యాబినెట్ మంత్రులు సోమవారం ఉదయం క్షేత్రస్థాయి పర్యటనలో పాల్గొన్నారు. నగరం అంతటా దెబ్బతిన్న రోడ్లను పరిశీలించి, గుర్తించారు. దీపావళి నాటికి గుంతలు లేని జాతీయ రాజధానిగా తీర్చిదిద్దుతామని వారు పేర్కొన్నారు. అతిషి, పబ్లిక్ వర్క్స్ డిపార్ట్‌మెంట్ (PWD) ఇంజనీర్‌లతో కలిసి దక్షిణ, ఆగ్నేయ ఢిల్లీలోని వివిధ ప్రాంతాలను సందర్శించారు. ఎన్.ఎస్.ఐ.సి ఓఖ్లా, మోడీ మిల్ ఫ్లైఓవర్, చిరాగ్ డిల్లీ, తుఘలకాబాద్, మధుర రోడ్, ఆశ్రమ్ చౌక్ మరియు దాని అండర్‌పాస్ వద్ద రోడ్లు శిథిలావస్థలో ఉన్నాయని ముఖ్యమంత్రి ఎక్స్ లో పోస్ట్‌లో తెలిపారు. ఈ రోడ్లపై గుంతల కారణంగా ప్రజలు ఇబ్బందులు పడాల్సి వస్తోందన్నారు. మరమ్మత్తు పనులను యుద్ధ ప్రాతిపదికన ప్రారంభించాలని అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు. “అరవింద్ కేజ్రీవాల్ మార్గదర్శకత్వంలో దీపావళి నాటికి ఢిల్లీవాసులందరికీ గుంతలు లేని రోడ్లను నిర్మించడం మా ప్రయత్నం” అని అన్నారు. మంత్రి సౌరభ్ భరద్వాజ్, మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా తూర్పు ఢిల్లీలోని రోడ్లను పరిశీలించారు.

 

 

 

➡️