ఢిల్లీ సిఎంగా రేపు అతిషి ప్రమాణం

Sep 20,2024 00:24 #Atishi, #delhi cm, #sworn
  • ముఖేష్‌ అహ్లావత్‌సహా ఐదుగురికి మంత్రి పదవులు

న్యూఢిల్లీ : ఢిల్లీ ముఖ్యమంత్రిగా అతిషి శనివారం ప్రమాణస్వీకారం చేయనున్నారు. అదే రోజున మరో ఐదుగురు మంత్రులుగా ప్రమాణస్వీకారం చేయనున్నారు. వీరిలో నలుగురు పాత మంత్రులు గోపాల్‌ రారు, సౌరభ భరద్వాజ్‌, కైలాష్‌ గహ్లోత్‌, ఇమ్రాన్‌ హుస్సేన్‌ ఉన్నారు. ఎమ్మెల్యే ముఖేష్‌ అహ్లావత్‌కు కొత్తగా మంత్రి పదవి లభించనుంది. సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి రాజ్‌ కుమార్‌ ఆనంద్‌ రాజీనామాతో ఖాళీ అయిన స్థానాన్ని సుల్తాన్‌పూర్‌ మజ్రా నియోజకవర్గం ఎమ్మెల్యే ముఖేష్‌ అహ్లావత్‌తో భర్తీ చేయనున్నారు. ఏప్రిల్‌లో ఆప్‌ పార్టీకి, మంత్రి పదవికి రాజ్‌ కుమార్‌ ఆనంద్‌ రాజీనామా చేశారు. శనివారం గరిష్టంగా ఏడుగురు ప్రమాణస్వీకారం చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇప్పటి వరకూ సిఎంసహా ఆరుగురు పేర్లను ఆ పార్టీ ప్రకటించింది.

➡️