నకిలీ ఓటును అడ్డుకున్న సీపీఐ(ఎం) ఏజెంట్లపై దాడి

May 14,2024 11:47 #Attack on CPI(M) agents, #Bengal

కోల్‌కతా : బెంగాల్‌లోని ఎనిమిది నియోజకవర్గాలకు జరిగిన నాలుగో దశ పోలింగ్‌ సందర్భంగా భారీ దాడి జరిగింది. సోమవారం తృణమూల్‌ కాంగ్రెస్‌, బీజేపీ పలు చోట్ల విస్త్రుత దాడులు చేశాయి. బూత్‌లు పట్టుకోవడం, ఓటరు అణచివేత, మోసపూరిత ఓటింగ్‌లు విస్త్రుతంగా నమోదయ్యాయి. బార్ద్వామన్‌ జిల్లా ఖేతుగ్రామ్‌లో తఅణమూల్‌ గ్రూపుల మధ్య జరిగిన ఘర్షణలో మింటూ షేక్‌ అనే వ్యక్తి చనిపోయాడు.
సీపీఐ(ఎం) కార్యకర్తలే ఈ దాడికి పాల్పడ్డారని తృణమూల్‌ ఆరోపించింది. వివిధ నియోజకవర్గాల్లో జరిగిన ఘర్షణల్లో పలువురు గాయపడ్డారు. సీపీఐ(ఎం) కార్యకర్తలతో పాటు పలువురు ఆసుపత్రుల్లో చేరారు. బహ్రంపూర్‌, కఅష్ణానగర్‌, రణగట్‌, బోల్పూర్‌, బీర్భూమ్‌, బుర్ద్వామన్‌ ఈస్ట్‌, బుర్ద్వామన్‌-దుర్గాపూర్‌ , అసన్సోల్‌ నియోజకవర్గాల్లో పోలింగ్‌ జరిగింది.
కఅష్ణానగర్‌ నియోజకవర్గంలోని నారాయణపూర్‌లో రెండు బూత్‌లలో నకిలీ ఓటును అడ్డుకున్న సీపీఐ(ఎం) ఏజెంట్లను తఅణమూల్‌ సభ్యులు కొట్టారు.ఈ ఘర్షణలో హస్ముత్‌ షేక్‌ అనే సీపీఐ(ఎం) కార్యకర్త తలకు తీవ్రగాయాలయ్యాయి. చాప్టా ప్రాంతంలో దాడి చేసిన తృణమూల్‌పై కృష్ణానగర్‌ సీపీఎం అభ్యర్థి ఎస్‌ఎం సాదీ నేరుగా పోరాడారు. బర్ద్వామన్‌ తూర్పు నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో తృణమూల్‌ హింసను సీపీఐ(ఎం) కార్యకర్తలు సంఘటిత పద్ధతిలో ప్రతిఘటించారు. బహరంపూర్‌ నియోజకవర్గంలోని బూత్‌ను సందర్శించిన కాంగ్రెస్‌ అభ్యర్థి అధిరరాజ్‌నన్‌ చౌదరిని తృణమూల్‌ సభ్యులు, పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. బర్ద్వామన్‌ దుర్గాపూర్‌ మందేశ్వర్‌లో బీజేపీ అభ్యర్థి దిలాప్‌ ఘోష్‌ను తృణమూల్‌ అడ్డుకుని ధ్వంసం చేసింది.

➡️