పశ్చిమ బెంగాల్‌లోని తూర్పు మేదినీపూర్ జిల్లాలో శనివారం ఉదయం జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఎ) అధికారుల బృందంపై దుండగులు దాడి చేశారు. ఈ దాడిలో ఒక అధికారి గాయపడ్డారు. భూపతినగర్‌లో తణమూల్ కాంగ్రెస్ నాయకుడి ఇంట్లో 2022లో జరిగిన పేలుడు కేసును విచారించేందుకు అధికారులు అక్కడకు వెళ్లారు. ఆ సమయంలో అధికారులపై దాడి జరిగింది. ఎన్‌ఐఏ బందం కారుపై విండ్‌స్క్రీన్‌ను పాడు చేయడంతో ఇటుకలు విసిరారు. ఈ మేరకు జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) కూడా పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
