రైలు పట్టాలు తప్పించి దొంగతనానికి యత్నం

Oct 2,2024 07:04 #Gujarat, #robbery

ఇద్దరు అరెస్టు 
అహ్మదాబాద్: గుజరాత్‌లోని బొటాడ్ జిల్లాలో రైలు పట్టాలు తప్పించి చోరీకి ప్రయత్నించిన ఇద్దరు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. రమేష్, జయేష్‌లుగా గుర్తించారు. ఇద్దరు కలిసి రైలు పట్టాలపై ఇనుప స్లాబ్‌ పెట్టి రైలును ధ్వంసం చేసేందుకు ప్రయత్నించారు. రైలు పట్టాలు తప్పిన తర్వాత లేదా ఆగిన తర్వాత ప్రయాణికులను దోచుకోవాలని నిందితులు ప్లాన్ చేసినట్లు అధికారులు తెలిపారు. ఈ ఘటన సెప్టెంబర్ 25వ తేదీ తెల్లవారుజామున మూడు గంటలకు జరిగింది. ఇనుప ముక్కను ఢీకొట్టి రైలు పట్టాలు తప్పకపోవడంతో పెను ప్రమాదం తప్పిందని అధికారులు తెలిపారు.

➡️