ముంబై : ఎన్‌సిపి (అజిత్‌పవార్ వర్గం) నేత, మహారాష్ట్ర మాజీ మంత్రి బాబా సిద్ధిఖీ శనివారం దారుణ హత్యకు గురైన సంగతి తెలిసిందే. సిద్దిఖీని తామే హత్య చేసినట్లు బిష్ణోరుగ్యాంగ్ ప్రకటించింది. ఈ నేపథ్యంలో తండ్రే కాదు.. ఆయన తనయుడు ఎమ్మెల్యే జీశాన్ సిద్దిఖీ కూడా బిష్ణోయ్ గ్యాంగ్ హిట్ లిస్ట్‌లో ఉన్నట్లు తెలిసింది. ఈ విషయాన్ని బాబా సిద్దిఖీపై కాల్పులు జరిపిన షూటర్లే పోలీసుల విచారణలో వెల్లడించినట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. తండ్రీ, కుమారుడిని ఇద్దరినీ బిష్ణోరు గ్యాంగ్ టార్గెట్ చేసిందని షూటర్లు తెలిపినట్లు సదరు వర్గాలు తెలిపాయి. హత్య జరిగిన ప్రదేశంలో బాబా సిద్ధిఖీ, జీశాన్‌లిద్దరూ ఉంటారని.. ఒకేసారి తమ పని అయిపోతుందని షూటర్లు భావించారు. ఒకవేళ ఇద్దరినీ ఒకేసారి చంపడం కుదరకపోయినా.. ముందు ఎవరు కనిపిస్తే వారిని కాల్చి చంపమని షూటర్లకు బిష్ణోరు గ్యాంగ్ నుంచి ఆదేశాలు వచ్చినట్లు సదరు వర్గాలు తెలిపాయి.
కాగా, ఎన్‌సిపి సీనియర్ నేత బాబా సిద్దిఖీని ఆయన కుమారుడు జీశాన్ సిద్ధిఖీ కార్యాలయం వద్దే బిష్ణోరు గ్యాంగ్ సభ్యులు కాల్చి చంపారు. దసరా సందర్భంగా కార్యాలయం బయట కొందరు టపాసులు కాలుస్తుండగా.. ముఖానికి గుడ్డలు కట్టుకుపి బైక్‌పై వచ్చిన దుండగులు తుపాకులతో కాల్పులు జరిపారు. దీంతో హుటాహుటిన సిద్దిఖీని లీలావతి ఆసుపత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ ఆయన మృతి చెందారు. ఈ హత్య కేసులో ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు.
బిష్ణోయ్ గ్యాంగ్ గతంలో బాలీవుడ్ ప్రముఖ నటుడు సల్మాన్‌ఖాన్‌ని టార్గెట్ చేసుకుంది. ఆయన ఇంటిపైనా కాల్పులు జరిపింది. సిద్దిఖీ హత్య మహారాష్ట్రలో కలకలం రేపింది. ఈ నేపథ్యంలో సల్మాన్‌ఖాన్ ఇంటి వద్ద మరోసారి భద్రతను పెంచారు.