బిజెపి, బిజెడిల వల్ల ఒడిశాలో వెనుకబాటుతనం : మల్లికార్జున ఖర్గే

May 16,2024 17:49

భువనేశ్వర్‌ : బిజెపి, బిజెడిల వల్ల ఒడిశా అన్ని రంగాల్లోనూ వెనుకబడిందని కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే మండిపడ్డారు. భువనేశ్వర్‌లో గురువారం ఖర్గే విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. ‘ ఒడిశాలో 24 ఏళ్లుగా నవీన్‌ పట్నాయక్‌ సిఎంగా ఉన్నారు. ఆయన హయాంలో రాష్ట్రం అన్ని రంగాల్లో వెనుకబడింది. వెనుకబాటుతనానికి బిజెపి, బిజెడిలు బాధ్యత వహించాలి. ఈ రెండు పార్టీల బహిరంగ పోరు రాష్ట్రానికి నష్టం కలిగిస్తోంది. ఇక్కడి పరిస్థితులను చక్కదిద్దాలంటే.. రాష్ట్రంలోనూ, కేంద్రంలోనూ ప్రభుత్వాలను మార్చాలి’ అని ఆయన పిలుపునిచ్చారు. ఇక సందర్భంగా ఒడిశా తమకెంతో కీలకమైన రాష్ట్రమని ఖర్గే అన్నారు. ఈ రాష్ట్రం నుంచే తమ పార్టీకి ఎంతోమంది నేతలు వచ్చారని, స్వతంత్ర పోరాటంలో పండిట్‌ జవహర్‌లాల్‌ నెహ్రూకు పట్నాయక్‌ నుంచి మద్దతు లభించిందని ఆయన గుర్తు చేసుకున్నారు.

➡️