కాశ్మీరీ జర్నలిస్టు అసిఫ్‌ సుల్తాన్‌కు బెయిల్‌

May 17,2024 08:59 #bail, #Journalist

న్యూఢిల్లీ : కాశ్మీరీ జర్నలిస్టు అసిఫ్‌ సుల్తాన్‌కు ఐదేళ్ల కిందటి ఉపా కేసులో శ్రీనగర్‌లోని ఒక కోర్టు బెయిల్‌ మంజారు చేసింది. జమ్ముకాశ్మీర్‌ ప్రజా భద్రత చట్టం కేసులో ఐదేళ్ల పాటు జైలు ఉండి ఈ ఏడాది ఫిబ్రవరి 29న విడుదలైన రెండు రోజుల్లోనే మళ్లీ ఉపా కేసులో అసిఫ్‌ సుల్తాన్‌ను పోలీసులు అరెస్టుచేయడం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. 2019లో శ్రీనగర్‌ సెంట్రల్‌ జైలులో జరిగిన అల్లర్లకు సంబంధించిన ఈ ఉపా కేసులో బుధవారం శ్రీనగర్‌లోని ప్రత్యేక కోర్టు అసిఫ్‌కు బెయిల్‌ మంజారుచేసింది. ఇది ఐదేళ్ల క్రితం జరిగిన సంఘటన అని, సుల్తాన్‌ ఇప్పటికే 72 రోజుల పాటు జైలుల్లో ఉన్నారని కోర్టు గుర్తు చేసింది. ఎటువంటి రహస్య / ఎన్‌క్రిప్టెడ్‌ మెసేజింగ్‌ యాప్‌లను లేదా ప్రాక్సీ నెట్‌వర్క్‌లను ఉపయోగించకూడదని సుల్తాన్‌కు ఆదేశాలు జారీ చేసింది. సుల్తాన్‌ జైల్లో ఉన్నప్పుడే 2019లోనే అమెరికన్‌ నేషనల్‌ ప్రెస్‌క్లబ్‌ జాన్‌ అబుచోన్‌ ప్రెస్‌ ఫ్రీడమ్‌ అవార్డును అందించింది.

➡️