న్యూఢిల్లీ : ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ఫిబ్రవరి 5వ తేదీన జరగనుంది. ఈ నేపథ్యంలో ఫిబ్రవరి 5న ఎగ్జిట్ పోల్స్, ఇతర సర్వేలపై ఎన్నికల సంఘం నిషేధం విధించింది. ఈ మేరకు ఈసీ నోటిఫికేషన్ జారీచేసింది. ఈ నేపథ్యంలో ఫిబ్రవరి 5న ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6.30 గంటల వరకు ఎగ్జిట్ పోల్స్ ప్రచురణపై నిషేధం విధించినట్లు ఇసి నోటిఫికేషన్‌లో పేర్కొన్నది. పోలింగ్ జరిగే రోజు ఎన్నికలకు సంబంధించిన ఎలాంటి వార్తలనుగానీ, ఒపీనియన్ పోల్ వివరాలను గానీ, ఇతర పోల్ సర్వేల వివరాలను గానీ ప్రచురించడానికి, ప్రదర్శించడానికి వీల్లేదని ఇసి తన నోటిఫికేషన్‌లో స్పష్టం చేసింది.
కాగా, ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలతోపాటు ఉత్తరప్రదేశ్‌లోని మిల్కిపూర్ అసెంబ్లీ స్థానానికి, తమిళనాడులోని ఈరోడ్ అసెంబ్లీ స్థానానికి ఫిబ్రవరి 5న పోలింగ్ జరగనుంది.
