మంత్రి పియూష్ గోయల్ వెల్లడి
న్యూఢిల్లీ : బాస్మతీయేతర బియ్యంపై నిషేధాన్ని ఎత్తివేసే అంశంపై త్వరలోనే మంత్రుల బృందం సమావేశం కానుందని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ వెల్లడించారు. ఫిక్కీ నిర్వహించిన సమావేశంలో మంత్రి పియూష్ మాట్లాడుతూ.. డిమాండ్, సరఫరా, ధరల పరిస్థితిని పరిగణనలోకి తీసుకుని చర్చలు జరుగుతాయన్నారు. భారత ఆహార ఉత్పత్తుల ఎగుమతుల విలువ రూ.4.6 లక్షల కోట్లుగా ఉందన్నారు. గతేడాది జులై నుంచి బాస్మతీయేతర బియ్యం ఎగుమతులపై నిషేధం ఉంది.
