మోడీకి మతిస్థిమితం సరిగ్గా లేదు : భూపేష్‌ బఘేల్‌

May 27,2024 17:11 #Bhupesh Baghel, #Chattisgarh, #modi

రాయ్ పూర్‌ : ప్రధాని నరేంద్రమోడీ ఇటీవల వ్యాఖ్యలు వింటే.. ఆయనకు మతిస్థిమితం సరిగ్గా లేదని అర్థమవుతుందని చత్తీస్‌గఢ్‌ మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్‌ సీనియర్‌ నేత భూపేష్‌ బఘేల్‌ తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన తాజాగా మీడియాతో మాట్లాడుతూ.. ‘మోడీ ఇటీవల తన ఇష్టానుసారం మాట్లాడుతున్నారు. కాంగ్రెస్‌ మేనిఫెస్టోను ఆయన ముస్లింలీగ్‌ అజెండాతో పోల్చారు. ఇంతటితో ఆగకుండా.. మహిళల మంగళసూత్రాలపైనా, మటన్‌, ఫిష్‌, బఫెలో, ముజ్రా వంటి వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు కొత్త పల్లవి అందుకున్నారు. తనను పరమాత్మ పంపారని చెబుతున్నారు. అంటే ఆయన సాధారణ మానవుడు కాదని అర్థం. మోడీ మాటలు వింటే.. ఆయన మానసిక స్థితి కుదురుగా లేదని వెల్లడిస్తున్నాయని ఆయన అన్నారు. ఇక ఈ సందర్భంగా రాహుల్‌ గాంధీ గురించి ప్రస్తావిస్తూ.. దేశాన్ని రెండు ముక్కలు చేసిన నేత మనవడగా ఆయన్ని అభివర్ణిస్తారు. అయితే మోడీ మాత్రం బిర్యానీ తినేందుకు నేరుగా పాకిస్తాన్‌ వెళ్లారని ఆయన ఎద్దేవా చేశారు. జవహర్‌లాల్‌ నెహ్రూని అగౌరవపరిచి తాను గొప్ప వ్యక్తిగా చెలామణి కావాలని మోడీ ప్రయత్నిస్తున్నారు. కానీ మోడీకి నెహ్రూతో ఎంతమాత్రం పోలిక లేదు. మోడీ పది జన్మలు ఎత్తినా నెహ్రూ కాలేరని బఘేల్‌ తేల్చి చెప్పారు.

➡️