న్యూఢిల్లీ : ఈ ఏడాది చివరలో బీహార్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఇండియా బ్లాక్‌లో భాగస్వామ్య పార్టీలైన ఆర్‌జెడి, కాంగ్రెస్‌లు కలిసి పోటీ చేయనున్నాయి. ఈ విషయాన్ని ఆర్‌జెడి ఎంపి మనోజ్ ఝా సోమవారం వెల్లడించారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో సీట్ల సర్దుబాటుపై ఆర్‌జెడి నేత తేజస్వియాదవ్ ఢిల్లీకి వెళ్లి మంగళవారం కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో చర్చించనున్నారని మనోజ్ ఝా తెలిపారు.
కాగా, ఆర్‌జెడి, కాంగ్రెస్ పార్టీల పొత్తుల నేపథ్యంలోనే బహుశా ఏప్రిల్ 20న బీహార్‌లో బక్సర్ జిల్లాలో జరిగే బహిరంగ సభలో ఖర్గే పాల్గొనే అవకాశం ఉంది.
Bihar Assembly elections: బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆర్‌జెడి, కాంగ్రెస్ కలిసి పోటీ
