కమల్ హాసన్ పై బిజెపి ‘కొకైన్’ ఆరోపణలు

May 16,2024 10:30 #Kamal Haasan, #tamilnadu
  • విచారణ చేయాలి

చెన్నై : వినోద పార్టీల్లో నటుడు కమల్ హాసన్ కొకైన్ అందిస్తున్నారని బిజెపి ఆరోపించింది. కుముతం యూట్యూబ్ ఛానెల్‌లో గాయని సుచిత్ర చెప్పిన మాటలను ఆధారంగా బిజెపి మళ్లీ కమల్‌పై విరుచుకుపడింది. దీనిపై బిజెపి తమిళనాడు ఉపాధ్యక్షుడు నారాయణన్ తిరుపతి ఎక్స్ ద్వారా విచారణకు అభ్యర్థించారు.

తన మాజీ భర్త కార్తీక్ కుమార్ కొకైన్ వాడుతున్నాడని, తమిళ చిత్ర పరిశ్రమలో డ్రగ్స్ సర్వసాధారణమని సుచిత్ర ఆరోపించింది. కార్తీక్ కుమార్ స్వలింగ సంపర్కుడని, ధనుష్, ఐశ్వర్య రజనీకాంత్ ఒకరినొకరు మోసం చేసుకున్నారని సుచిత్ర ఓ ఇంటర్వ్యూలో చెప్పింది. ఇందులో కమల్‌పై ప్రస్తావన కూడా ఉంది. సుచిత్ర ఇంటర్వ్యూ తమిళ చిత్ర సీమలో పెద్ద చర్చనీయాంశం అవుతోంది.

➡️