రాజ్యాంగాన్ని రద్దు చేసే ఉద్దేశ్యంతో బిజెపి: స్టాలిన్‌

Apr 15,2024 00:01 #speech, #Stalin

చెన్నై : అంబేద్కర్‌ రచించిన భారత రాజ్యాంగాన్ని రద్దు చేసే భయంకరమైన ఉద్దేశ్యంతో బిజెపి ఉందని తమిళనాడు ముఖ్యమంత్రి, డిఎంకె అధ్యక్షులు ఎంకె స్టాలిన్‌ విమర్శించారు. ఆదివారం అంబేద్కర్‌ జయంతి సందర్భంగా స్టాలిన్‌ ఎక్స్‌లో ఒక పోస్ట్‌ చేశారు. బిజెపి తన తిరోగమవాదంతో దేశాన్ని తీవ్రమైన ఆకలి వైపునకు, రెండు శతాబ్దాల వెనక్కి తీసుకుని వెళ్లిందని ఈ పోస్టులో ఆరోపించారు. భారతదేశం తన చరిత్రలోనే అత్యంత కీలకమైన ఎన్నికలను ఎదుర్కొంటుందని అన్నారు. అంబేద్కర్‌ను నవయుగ బుద్దుడుగా అభివర్ణించారు. నిజమైన సమసమాజాన్ని సాధించడానికి అంబేద్కర్‌ అంతులేని జ్ఞానం, స్ఫూరిని మనం అనుసరించాలని స్టాలిన్‌ పిలుపునిచ్చారు.

➡️