పాట్నా: బీహార్‌లో విజయదశమి వేడుకల సందర్భంగా బీజేపీ ఎమ్మెల్యే బాలికలకు కత్తులు పంపిణీ చేశారు. ఈ ఘటన బీహార్‌లోని సీతామర్హి జిల్లాలో చోటుచేసుకుంది. విజయదశమి కార్యక్రమాలకు తరలివచ్చిన పాఠశాల, కళాశాల విద్యార్థులకు కత్తులు పంపిణీ చేశారు.
‘ఏ దుర్మార్గుడైనా మన సోదరీమణులను తాకడానికి సాహసిస్తే ఈ కత్తితో అతని చేయి నరికి వేయండి’ అంటూఎమ్మెల్యే మిథిలేష్ కుమార్ కత్తులు పంచారు. వేధించే వారి చేతులు నరికివేసే శక్తి అక్కాచెల్లెళ్లకు రావాలని, అవసరమైతే మీరు, తనూ అలాగే చేయాలని ఆయన అన్నారు.