డీలిమిటేషన్‌ వ్యతిరేక సదస్సుకు బిజెడి

Mar 12,2025 00:26 #anti-delimitation, #BJD, #Conference, #Hold

భువనేశ్వర్‌ : లోక్‌సభ స్థానాల పునర్విభజన (డీలిమిటేషన్‌)ను వ్యతిరేకిస్తూ తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకె స్టాలిన్‌ నేతృత్వంలో చెన్నరులో ఈ నెల 22న డిఎంకె నిర్వహించనున్న సదస్సుకు ఒడిశా మాజీ ముఖ్యమంత్రి నవీన్‌ పట్నాయక్‌ నేతృత్వంలోని బిజు జనతా దళ్‌ (బిజెడి) హాజరు కానుంది. ఈ మేరకు డిఎంకె నాయకులు దయానిధి మారన్‌, తమిళనాడు ఐటిశాఖ మంత్రి టిఆర్‌బి రాజాజా భువనేశ్వర్‌ వెళ్లి నవీన్‌ పట్నాయక్‌ను ఆహ్వానించగా అందుకు ఆయన సమ్మతించారు. ఈ విషయాన్ని బిజెడి ఉపాధ్యక్షులు దేబీ ప్రసాద్‌ మిశ్రా తెలిపారు. డీలిమిటేషన్‌ సమస్య పట్ల తమ పార్టీ కూడా ఆందోళన వ్యక్తం చేస్తోందని, 22న జరిగే సమావేశానికి నవీన్‌ పట్నాయక్‌ హాజరవుతారని పేర్కొన్నారు. ఈ సందర్భంగా దయానిధి మారన్‌ మాట్లాడుతూ కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం ఏకపక్ష ధోరణితో చేస్తున్న డీలిమిటేషన్‌ కసరత్తుకు వ్యతిరేకంగా రాజకీయ పార్టీల ప్రతినిధులతో ఉమ్మడి కార్యాచరణ కమిటీని ఏర్పాటు చేయాల్సిన అవసరాన్ని ఇప్పటికే తమ అధినేత స్టాలిన్‌ నొక్కి చెప్పారని తెలిపారు. ఈ ప్రక్రియ వల్ల తమిళనాడు, కేరళ, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ, ఒడిషా, పంజాబ్‌కు ఎక్కవ ఎంపీ స్థానాలను కోలోనష్టపోతాయని మారన్‌ చెప్పారు. ఇప్పటికే నిధుల్లో కేంద్రం కోత విధిస్తోందని, ఇక ఎంపీ స్థానాలు తగ్గిపోతే అస్సలు పట్టించుకోబోదని ఆందోళన వ్యక్తం చేశారు.

➡️