నెత్తుటి తడారని దండకారణ్యం

Dec 13,2024 23:23 #Chhattisgarh encounter

బీజాపూర్‌లో మళ్లీ ఎదురు కాల్పులు
ఇద్దరు మావోయిస్టులు మృతి
బీజాపూర్‌ : ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రం బీజాపూర్‌ జిల్లా దండకారణ్యంలో మరోమారు ఎదురుకాల్పులు జరిగాయి. వరుస ఎన్‌కౌంటర్లతో దండకారణ్యం నెత్తురోడుతూనేవుంది. మూడు రోజుల పాటు వరుస ఎన్‌కౌంటర్‌ జరగడంతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొనాుయి. కాగా, శుక్రవారం నేంద్రాఅడవుల్లో మావోయిస్టుల ఏరివేతకుభద్రతా బలగాలు కూంబింగ్‌ చేపట్టాయి. ఈ క్రమంలో జరిపిన కాల్పుల్లో ఇద్దరు మావోయిస్టులు చనిపోయారు. ఈ ఆపరేషన్‌లో డిఆర్‌జి, సిఆర్‌పిఎఫ్‌, బస్తర్‌ ఫైటర్స్‌ విభాగాలకుచెందిన జవాన్లు పాల్గనాురు. మృతిచెందిన మావోయిస్టులను.. రూ.లక్ష రివార్డు కలిగిన ఏరియా సిఎన్‌ఎం అధ్యక్షులు కవ్వాసి అంగ, నేంద్ర ఆర్‌పిసి జనతం సర్కార్‌ ఉపాధ్యక్షులు సోమద కల్ముగా పోలీసులు గుర్తించారు. వీరి మృతదేహాలతో పాటు పెద్ద మొత్తంలో ఆయుధాలను స్వాధీనం చేసుకునుట్టు జిల్లా ఎస్‌పి జితేంద్ర యాదవ్‌ తెలిపారు. కాగా తప్పించుకును మరికొందరు మావోయిస్టుల కోసం గాలింపు చర్యలు కొనసాగుతునుట్టు వెల్లడించారు. కాగా, ఇటీవల బీజపూర్‌ జిల్లా గంగులూరు పోలీస్‌ స్టేషన్‌ పరిధి ముంగా అటవీప్రాంతం, గురువారం అంబూజ్‌మడ్‌-నారాయణ్‌ పూర్‌-దంతెవాడ సరిహద్దు ప్రాంతం, శుక్రవారం బీజాపూర్‌ జిల్లా బాసగూడ అటవీప్రాంతంలో జరిగిన వరుస ఎన్‌కౌంటర్లలో 10 మంది మావోయిస్టులు మృతి చెందిన విషయం తెలిసిందే.

➡️