ఎయిర్‌ ఇండియాకు బాంబు బెదిరింపు

ఢిల్లీ : ముంబై నుంచి న్యూయార్క్‌కు బయలుదేరిన ఎయిర్‌ ఇండియా విమానానికి బాంబు బెదిరింపు రావడంతో సోమవారం ఢిల్లీకి మళ్లించినట్లు విమానాశ్రయ వర్గాలు తెలిపాయి. న్యూయార్క్‌ వెళ్లే విమానంలో బాంబు ఉన్నట్టు ఎక్స్‌లో మెసేజ్‌ వచ్చింది. ఈ సందేశం రాగానే విమానాన్ని ఢిల్లీకి మళ్లించాలని భద్రతా సంస్థలు ఆదేశించాయి. విమానం ప్రస్తుతం డిల్లీలోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఉంది. విమానంలోని ప్రయాణికులు, సిబ్బంది భద్రతను నిర్ధారించడానికి అన్ని ప్రామాణిక భద్రతా ప్రోటోకాల్‌లు అనుసరిస్తున్నాయని అధికారి ఉషా రంగనాని తెలిపారు. ఈ క్రమంలో ప్రయాణికులను విమానాశ్రయ టెర్మినల్‌ బిల్డింగ్‌కు తీసుకెళ్లారు. అక్కడ వివిధ ఏజెన్సీలతో కూడిన బృందం విమానాన్ని స్కాన్‌ చేసింది.

➡️