గగనతలంలో ఉండగా బాంబు బెదిరింపులు – మళ్లీ వెనక్కు..!

ముంబయి : ఎయిరిండియా విమానం గగనతలంలో ఉండగా… బాంబు బెదిరింపులు రావడంతో ఆ విమానం వెనక్కు మళ్లింది.. తీరా వివరాలు చూస్తే అది నకిలీ కాల్‌ అని తేలింది..! జాతీయ మీడియా కథనాల మేరకు … బోయింగ్‌ 777 విమానం ముంబయి నుంచి న్యూయార్క్‌ బయలుదేరింది. నాలుగు గంటల తర్వాత అజర్‌బైజాన్‌ ప్రాంతంలో విమానం గగనతలంలో ఉండగా బాంబు బెదిరింపులు వచ్చాయి. సిబ్బందికి ఈ బెదిరింపులు రావడంతో.. వెంటనే అప్రమత్తమైన పైలట్లు ముంబయి వైపు విమానాన్ని మళ్లించారు. విమానాన్ని పైలట్లు టేకాఫ్‌ అయినచోటే దింపారు. అక్కడ ల్యాండ్‌ అయిన వెంటనే బాంబ్‌ డిటెక్షన్‌ స్క్వాడ్‌ రంగంలోకి దిగి, తనిఖీలు చేపట్టింది. చివరికి అది నకిలీ కాల్‌ అని తెలుస్తోంది.

➡️