బాంబే హైకోర్టు తీర్పుతో… డిజిటల్‌ మీడియాకు ఊరట

  • ఐటీ రూల్స్‌ సవరణలను తోసిపుచ్చిన న్యాయస్థానం

న్యూఢిల్లీ : కేంద్ర ప్రభుత్వం గత సంవత్సరం ఐటీ నిబంధనలకు తీసుకొచ్చిన సవరణలను బాంబే హైకోర్టు ఇటీవల కొట్టివేయడం డిజిటల్‌ మీడియాకు పెద్ద ఊరట ఇచ్చింది. ఈ సవరణలు భావ ప్రకటనా స్వేచ్ఛకు సంబంధించిన ఆర్టికల్‌ 19-1 (ఏ) సహా పలు రాజ్యాంగ నిబంధనలను ఉల్లంఘిస్తున్నాయని న్యాయస్థానం స్పష్టం చేసింది. సామాజిక మాధ్యమ వేదికలలో అవాస్తవమైన లేదా తప్పుదోవ పట్టించే సమాచారాన్ని గుర్తించేందుకు ఫాక్ట్‌ చెక్‌ యూనిట్‌ (ఎఫ్‌సీయూ)ను ఏర్పాటు చేయడానికి ఈ సవరణలు కేంద్ర ప్రభుత్వానికి అధికారాలు కట్టబెట్టిన విషయం తెలిసిందే.ప్రభుత్వ సవరణలను వ్యతిరేకిస్తూ సెటైరిస్ట్‌ కునాల్‌ కమ్రా బాంబే హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. డిజిటల్‌ మీడియాపై సెన్సార్‌షిప్‌ విధించేందుకు కేంద్ర ప్రభుత్వానికి విశేషాధికారాలు కల్పించే ఈ సవరణలు కోర్టు తీర్పుతో ఇప్పుడు అటకెక్కాయి.

➡️