న్యూఢిల్లీ : పార్లమెంటు శీతాకాల సమావేశాల మూడోరోజైన బుధవారం సభ ప్రారంభమైన కొద్దిసేపటికే ఉభయ సభలు వాయిదా పడ్డాయి. రాజ్యసభలో వివిధ అంశాలపై 18 వాయిదా తీర్మానాలను సభాపతి తిరస్కరించారు. రోజువారీ కార్యకలాపాలను సస్పెండ్ చేసి, అదానీ అంశంపై చర్చ జరపాలని ప్రతిపక్ష సభ్యులు నిరసనలు చేపట్టారు. దీంతో ఎగువ సభను 11.30 గంటలకు , అనంతరం మరుసటి రోజుకు వాయిదా వేశారు.
మరోవైపు లోక్‌సభలో కూడా ఆదానీ కుంభకోణంపై చర్చ జరపాలంటూ నిరసనలు కొనసాగాయి. 11.00 గంటలకు ప్రారంభమైన సభ ముందు 12 గంటలకు వాయిదా పడింది. సభ తిరిగి సమావేశమైన అనంతరం కూడా ప్రతిపక్షాలు అదానీ కేసుపై చర్చకు పట్టుపట్టడంతో స్పీకర్ సభను రేపటికి వాయిదా వేశారు.