బీపీఎల్‌ గ్రూప్‌ ఛైర్మన్‌ గోపాలన్‌ నంబియార్‌ కన్నుమూత

బెంగళూరు: బీపీఎల్‌ గ్రూప్‌ ఛైర్మన్‌ టీపీ గోపాలన్‌ నంబియార్‌ (94) కన్నుమూశారు. గత కొన్ని రోజులుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన.. బెంగళూరులోని నివాసంలో గురువారం తుదిశ్వాస విడిచారు. గోపాలన్‌ మృతిపట్ల ప్రధాని మోడీ సంతాపం వ్యక్తం చేశారు. ఆయన మృతి ఎంతో బాధించిందని, కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. 1990ల్లో ఎలక్ట్రానిక్‌ రంగంలో బీపీఎల్‌దే హవా. అలాంటిది అంతర్జాతీయ బ్రాండ్లయిన శాంసంగ్‌, ఎల్‌జీ ప్రవేశంతో తన వైభవాన్ని కోల్పోయింది. ప్రస్తుతం గోపాలన్‌ నంబియార్‌ తనయుడు అజిత్‌ నంబియార్‌ బీపీఎల్‌కు ఛైర్మన్‌గా, సీఈఓగా వ్యవహరిస్తున్నారు.

➡️