సంభాల్‌ ఘటనకు బిజెపి ప్రభుత్వమే కారణం : బృందాకరత్‌

brinda karat on kerala governor

లక్నో: సంభాల్‌లో మసీదు సర్వే అనంతర ఘటనలకు ఉత్తర ప్రదేశ్‌ ప్రభుత్వమే కారణమని సిపిఎం పొలిట్‌బ్యూరో సభ్యురాలు బృందా కరత్‌ విమర్శించారు. సంభాల్‌ ఘటనలో ఉత్తర ప్రదేశ్‌ ప్రభుత్వ కుట్ర ఉందని,మైౖనార్టీలను లక్ష్యంగా చేసుకుని యోగి ప్రభుత్వం విచ్ఛిన్నకర రాజకీయాలకు పాల్పడుతోందని అన్నారు. ఆదివారం సంభాల్‌లోని షాహి జామా మసీదులోకి పెద్ద యెత్తున పోలీసు బలగాలు ప్రవేేశించాయని, దీనిని వ్యతిరేకించిన స్థానికులపై పోలీసులు కాల్పులు జరిపారని, ఈ కాల్పుల్లో మొత్తం అయిదుగురు వ్యక్తులు చనిపోయారని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి హీరాలాల్‌ యాదవ్‌ చెప్పారు. మసీదు సర్వేకు వ్యతిరేకంగా సుప్రీం కోర్టులో ఆయన పిటిషన్‌ కూడా వేశారు. దీనిపై సుప్రీం కోర్టు తక్షణమే జోక్యం చేసుకోవాలని బృందాకరత్‌ కోరారు. 1991లో ఆమోదివంచబడిన ప్రార్థనా స్థలాల చట్టం స్వాతంత్య్రం వచ్చిన తర్వాత దేశంలోని మత ప్రార్థనా స్థలాల విషయంలో యథాతథ స్థితి కొనసాగించాలని పేర్కొంటోంది. దీనికి భిన్నంగా దిగువ కోర్టు ఇచ్చిన తీర్పుపై సుప్రీం కోర్టు జోక్యం చేసుకుని ఆ ఉత్తర్వులను రద్దు చేయాలని ఆమె కోరారు.. లేని పక్షంలో మతోన్మాద రాజకీయాలు చేసేవారు పదే పదే దిగువ కోర్టుకు వెళ్లి ఇటువంటి ఆదేశాలను తెచ్చుకుంటారు. ఈ ఆదేశాల్ని ఉపయోగించి మసీదులను లక్ష్యంగా చేసుకుంటారు. ఇది మత పరమైన హింసకు దారి తీస్తుందని సంభాల్‌ ఘటనే ఇందుకు నిదర్శనమని ఆమె అన్నారు.
సమాజ్‌వాది నేతలపై తప్పుడు కేసులు
సంభాల్‌లో మసీదు సర్వే సందర్భంగా ముగ్గురు ముస్లిం యువకులను అన్యాయంగా కాల్చి చంపిన పోలీసులు ఇప్పుడు బాధితులపైనే తప్పుడు కేసులను బనాయించారు. బ ఇటీవల కాల్చి చంపిన పోలీసులు ఇప్పుడు బాధితుల కుటుంబాలపై తప్పుడు కేసులు బనాయించారు. రాళ్ల దాడి ఘటన జరిగిన ఒక రోజు తర్వాత హింసాత్మక ప్రాంతంలో ఆర్‌ఎఎఫ్‌ సిబ్బందిని మోహరించారు. ఇంటర్నెట్‌ సేవలను నిలిపేశారు. సమాజ్‌వాది పార్టీ నేత అఖిలేశ్‌ యాదవ్‌ స్పందిస్తూ, పార్టీ నేతలపై తప్పుడు కేసులు పెట్టడాన్ని వ్యతిరేకించారు.

➡️