Budget 2025-26 : ఖరీదైనవి, చౌకైనవి .. ?

వీటి ధరల్లో మార్పులు
న్యూఢిల్లీ : కేంద్ర బడ్జెట్‌లో పలు ఉత్పత్తుల ధరల్లో మార్పులు జరగనున్నాయి. ప్రభుత్వం ప్రకటించిన పన్ను మినహాయింపులు, ఎగుమతి, దిగుమతులపై సుంకాల మార్పులు పలు వస్తువుల ధరలపై ప్రభావం చూపనున్నాయి. 36 ఔషధాలపై బేసిక్‌ కస్టమ్స్‌ డ్యూటీ తొలగించడం ద్వారా ఈ ఔషధాల ధరలు తగ్గనున్నాయి. ఇంటరాక్టివ్‌ ప్లాట్‌ ప్యానెల్‌ డిస్‌ప్లే మీదా పన్నును 10 శాతం నుంచి 20 శాతానికి పెంచారు. దీంతో టివిల రేట్లు పెరిగే అవకాశం ఉంది.

ధరలు తగ్గేవి..

  • క్యాన్సర్‌ మందులు
  • ప్రాణాలను రక్షించే మందులు
  • ఎల్‌సిడి, ఎల్‌ఇడి టివిలు
  • మొబైల్‌ ఫోన్లు
  • తోలు వస్తువులు
  • వైద్య పరికరాల
  • ఫ్రోజెన్‌ చేపలు
  • చేపల పేస్ట్‌
  • వెట్‌ బ్లూ లెదర్‌
  • క్యారియర్‌-గ్రేడ్‌ ఈథర్నెట్‌ స్విచ్‌లు
  • 12 కీలకమైన ఖనిజాలు

పెరిగేవి..

  •  అల్లికల దుస్తులపై కస్టమ్స్‌ పన్ను 10 నుంచి 20 శాతానిక పెంపు
  • దిగుమతి చేసుకునే కొవ్వొత్తులు
  •  దిగుమతి చేసుకునే విలాసవంతమైన పడవలు
  •  పాలీవినైల్‌ క్లోరైడ్‌ (పివిసి)
  • ఉత్పత్తులు
  •  విదేశీ చెప్పులు
  •  స్మార్ట్‌ మీటర్లు, సోలార్‌ బ్యాటరీలు
➡️