న్యూఢిల్లీ : పార్లమెంటులో శనివారం నిర్మలా సీతారామన్ బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. వచ్చేవారం పార్లమెంట్ ముందుకు కొత్త ఆదాయ పన్ను బిల్లు ప్రవేశపెట్టనున్నారు. ఆదాయ పన్నులో కొత్త శ్లాబులను ప్రకటించారు.
25-26 ఆర్థిక సంవత్సరంలో కొత్త పన్ను శ్లాబు వివరాలు
రూ.4 లక్షల వరకు – పన్ను లేదు
రూ.4 – 8 లక్షల వరకు – 5 శాతం
రూ.8-12 లక్షల వరకు – 10 శాతం
రూ.12-16 లక్షల వరకు -15 శాతం
రూ.16-20 లక్షల వరకు – 20 శాతం
రూ.20-24 లక్షల వరకు – 25 శాతం
రూ. 24 లక్షలు దాటితే – 30 శాతం
2024-25 పన్ను శ్లాబు వివరాలు
రూ.3 లక్షల వరకు – పన్ను లేదు
రూ.3-7 లక్షల వరకు – 5 శాతం
రూ.7-10 లక్షల వరకు -10 శాతం
రూ10-12 లక్షల వరకు -15 శాతం
రూ.12-15 లక్షల వరకు -20 శాతం
రూ.15 లక్షలు దాటితే – 30 శాతం
ఏడాదికి రూ.12 లక్షల వరకు సంపాదిస్తున్న వేతన జీవులకు కొత్త శ్లాబు ప్రకారం ఎలాంటి ఆదాయ పన్ను చెల్లించాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. స్టాండర్ట్ డిడక్షన్ రూ.75,000 మరియు రూ.12.75 లక్షల వరకు వార్షిక ఆదాయం ఉన్న వారు జీరో పన్ను చెల్లించాల్సి వుంటుందని అన్నారు.