Budget : ఏపీ ఊసెత్తని నిర్మలమ్మ

Feb 1,2025 14:04 #AP, #Budget

దేశమంటే మట్టికాదు.. దేశమంటే మనుష్యులోరు అన్న గురజాడ కవితతో ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. అయితే ఏపీకి చెందిన కవి గురజాడ గురించి ప్రస్తావించిన ఆమె.. ప్రసంగంలో మాత్రం ఆంధ్రప్రదేశ్‌ గురించి ప్రస్తావించకపోవడం గమనార్హం. ఎన్డీయే కూటమి ప్రభుత్వంలో కీలక భాగస్వామిగా ఉన్న టిడిపి కూటమి ప్రభుత్వం అధికారంలో ఉన్న ఏపీ రాష్ట్రం గురించి.. బడ్జెట కేటాయింపుల గురించి ఆమె మాట్లాడలేదు. ముఖ్యంగా ఏపీ రాజధాని గురించి గానీ, ప్రతిష్టాత్మక ప్రాజెక్టు పోలవరం, విశాఖ ఉక్కుతో సహా ఏ అంశాన్ని గురించి నిర్మలాసీతారమన్‌ ప్రకటించలేదు. మరోవైపు ఎన్డీయే ప్రభుత్వంలో మరో భాగస్వామ్య పార్టీ జెడియు అధికారంలో ఉన్న బీహార్‌కు మాత్రం నిర్మలమ్మ వరాల జల్లు కురిపించారు. బడ్జెట్‌లో ఎక్కువశాతం బీహార్‌కే కేటాయింపులు జరిగాయి. దీనిపై కాంగ్రెస్‌ సీనియర్‌ నేత జైరాం రమేశ్‌ కూడా విమర్శించారు.

➡️