న్యూఢిల్లీ : కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రవేశపెట్టేరోజున ధరించే శారీ ఎంపికలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటారు. ఇప్పటివరకు ఆమె కట్టిన చీరలన్నీ ప్రత్యేకంగా నిలిచినవే. 2025-26 బడ్జెట్ ప్రవేశపెట్టే నేడు ఆమె గోధుమరంగు చీర, ఎరుపు రంగు జాకెట్‌ను ధరించారు. ఈసారి స్పెషల్‌గా ఓ శాలువా వేసుకుని మరీ కనిపించారు. ఈ చీరను పద్మశ్రీ అవార్డు గ్రహీత దులారీ దేవి ఆమెకు కానుకగా ఇచ్చినట్లు తెలిసింది. ఈ చీరను దులారీనే డిజైన్ చేయడం విశేషం. ఈ చీరను బడ్జెట్ ప్రవేశపెట్టే సమయంలో కట్టుకోవాలని దులారీ నిర్మలమ్మను కోరారట. దీంతో నేడు బడ్జెట్ రోజున ఈ చీరను నిర్మలమ్మ కట్టుకున్నట్టు తెలిసింది.
