Budget Session : కొత్త అంశాలు లేని రాష్ట్రపతి ప్రసంగం : రాహుల్‌ గాంధీ

న్యూఢిల్లీ :   పార్లమెంట్‌ సమావేశాల్లో సోమవారం రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానం సందర్భంగా లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్‌ గాంధీ మాట్లాడారు. రాష్ట్రపతి ప్రసంగంలో కొత్త అంశాలేవీ లేవని అన్నారు. మేకిన్‌ ఇండియా దేశంలో విఫలమైందని అన్నారు. ఫోన్‌ తయారీ ఉత్పత్తి అవకాశాలను పూర్తిగా ఉపయోగించుకోలేకపోయామని అన్నారు. దేశంలో ఎలక్ట్రానిక్‌ పరికరాల తయారీలో వెనకబడ్డామని అన్నారు. గత దశాబ్ద కాలంగా దేశాన్ని పాలించిన కాంగ్రెస్‌ నేతృత్వంలోని యుపిఎ గాని, బిజెపి నేతృత్వంలోని ఎన్‌డిఎ గానీ నిరుద్యోగ సమస్యను పరిష్కరించలేకపోయాయని అన్నారు.

➡️